Sunday, May 19, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఎస్సైగారు.. సార్ కొడుతున్నాడు..

ఎస్సైగారు.. సార్ కొడుతున్నాడు..

పోలీసులకు ఫిర్యాదు చేసిన 3వ తరగతి బుడ్డోడు
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
స్పాట్ వాయిస్, బయ్యారం: ఎస్సైగారు.. మ్యాథ్స్ టీచర్ కొడుతున్నాడు.. కేసు పెట్టండి అంటూ 3వ తరగతి బుడ్డోడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. బ‌య్యారం మండ‌ల కేంద్రంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో అనిల్ నాయ‌క్ అనే విద్యార్థి మూడో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. కొంత‌కాలం నుంచి మ్యాథ్స్ టీచ‌ర్ ఆ విద్యార్థిని కొడుతున్నాడు. దీంతో టీచ‌ర్ బాధిత విద్యార్థి ఏకంగా పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి.. ఫిర్యాదు చేశాడు. మ్యాథ్స్ టీచ‌ర్ త‌న‌ను కొడుతున్నాడ‌ని, అత‌నిపై చ‌ర్యలు తీసుకోవాల‌ని ఎస్సైకి ర‌మాదేవికి అనిల్ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments