Wednesday, May 8, 2024
Homeరాజకీయంమేయరూ పాయే...

మేయరూ పాయే…

కాంగ్రెస్ వశమవుతున్న ఓరుగల్లు..
ఒక్కొక్కరుగా కారు దిగి.. హస్తం గూటికి
కాంగ్రెస్ కండువా కప్పుకున్న గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి
స్పాట్ వాయిస్, వరంగల్: ఓరుగల్లులో బీఆర్ఎస్ కోటు కూలిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చిన నాలుగు నెలలకే.. ఒక్కొక్కరుగా కారు దిగి.. హస్తం నీడకు చేరుతున్నారు. తాజాగా వరంగల్ గడ్డపై బీఆర్ ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ వైపు చూసిన గుండు సుధారాణి గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. రెండు రోజుల క్రితం వరంగల్ లో జరిగిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశాల్లోనూ ఆమె పాల్గొనలేదు. కేటీఆర్ కి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కూడా ఆమె ఫొటో ఎక్కడ కనిపించలేదు. ఈ క్రమంలో గురువారం తన పార్టీ మార్పును నిజం చేస్తూ.. జగ్గారెడ్డి, కోదండ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments