Tuesday, May 7, 2024
Homeజిల్లా వార్తలుఇసుక అక్రమ రవాణాను అడ్డుకోరా..?

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోరా..?

సమాచారం ఇచ్చినా స్టేషన్ నుంచి రారా..!
అక్రమార్కులపై ఎందుకుంతా ప్రేమా..?
మానేరు నుంచి అర్ధరాత్రి ఇసుక దందా
చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్
స్పాట్ వాయిస్, టేకుమట్ల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని బూర్నపల్లి-వెంకట్రావ్ పల్లి గ్రామాల మధ్యలోని మానేరు వాగు ఇసుకను పది రోజులుగా అర్ధరాత్రి జేసీబీలతో లారీల్లో పట్టణాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం సైతం బుధవారం రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఇసుక తరలింపు మొదలు పెట్టి గురువారం తెల్లవారుజామున 4 గంటల వరకు 2 జీసీబీలతో 8 లారీల్లో ఇసుకను వరంగల్ తోపాటు పెద్దపల్లి జిల్లాల వైపు తరలించారని రైతులు చెబుతున్నారు. ఇసుక అక్రమ రవాణాను ఆపడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక జేసీబీ వాగులో, మరో జేసీబీ ఇసుక డంప్ లోని ఇసుకను లారీలను లోడ్ చేస్తున్నాయని, 100 డయల్ చేసి సమాచారం ఇచ్చినా స్పందన కరువైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫోన్లు చేసిన పోలీసులు రాకపోవడంతో అక్రమార్కులు లారీలను లోడ్ చేసుకొని దర్జాగా వెళ్లిపోయారని చెబుతున్నారు. ఇప్పటికే మానేరు, చలివాగులు ఎండిపోయి భూగర్భజలాలు అడుగంటుంతున్నాయని, ఇసుక తోడుతుండడంతో నీరు మరింత లోతుకు వెళ్లి పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని కన్నీరు పెట్టుకుంటున్నారు. వాగులో సాగు నీటికోసం బోర్లు వేసి అప్పులపాలు అవుతున్నామని అన్నదాతలు విలపిస్తున్నారు. పోలీస్ స్టేషన్, చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసిన కొంతమంది యథేచ్ఛగా ఇసుక దందా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక డంప్ లను సీజ్ చేసి, వాగులోని పోసిన రోడ్డును తొలగించాలని, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని రైతులు కోరుతున్నారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments