Sunday, May 19, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఎమ్మెల్సీ కవిత మళ్లీ అరెస్ట్..

ఎమ్మెల్సీ కవిత మళ్లీ అరెస్ట్..

మొన్న ఈడీ.. నేడు సీబీఐ
స్పాట్ వాయిస్, బ్యూరో: మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత జైలు లో ఉండగానే మళ్లీ అరెస్ట్ అయింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ఇప్పటికే ఈడీ కేసులో జ్యుడీషియల్​ కస్టడీలో భాగంగా తిహార్​ జైలులో ఉన్న కవితను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇదే కేసులో గతంలో కవితను హైదరాబాద్‌లో సీబీఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈనెల 6వ తేదీన తిహార్ జైలులో మరోసారి ప్రశ్నించారు. ఇక ఇప్పుడు మళ్లీ ఆమెను ప్రశ్నించేందుకు అధికారులు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకున్నారు. దీంతో అరెస్ట్ అయి కస్టడీలో ఉన్న కవిత మరోసారి అరెస్ట్ అయినట్లైంది. అటు ఈడీ.. ఇటు సీబీఐ కూడా అరెస్ట్ చేయడంతో ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామమే చోటుచేసుకుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments