Sunday, May 19, 2024
Homeజిల్లా వార్తలుపదేళ్ల పాలనలో బీఆర్ ఎస్ చేసింది శూన్యం

పదేళ్ల పాలనలో బీఆర్ ఎస్ చేసింది శూన్యం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
స్పాట్ వాయిస్, గణపురం : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది శూన్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆరోపించారు. రూ. 1.14 లక్షలతో మండలంలోని గణపసముద్రం చెరువు మరమ్మతు పనులు, రూ. 49.15 లక్షలతో సీతారాంపురంకు చెందిన చిర్ర చెరువు మరమ్మతు పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్ఆర్ మాట్లాడుతూ అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపడుతోందన్నారు. తాము ప్రజలకు సేవకులమని, ప్రజాసేవ లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. ఓ వైపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్లు కడుపు మండి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 10 లక్షల ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల విద్యుత్, రూ. 500లకే గ్యాస్ తదితర పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో అవినీతి సహించేది లేదని, పేదల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ను ఎంపీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ కావటి రజిత రవీందర్, వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, మండల కో ఆప్షన్ సభ్యులు చోటేమియా, సొసైటీ చైర్మన్ కన్నబోయిన కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు రేపాక రాజేందర్, ఎంపీటీసీ కాలియా సాగర్, ఘనప సముద్రం మత్స్యశాఖ చైర్మన్ మునిగాల రమేష్, మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ, మాజీ జెడ్పీటీసీ ముత్యాల రాజయ్య, మాజీ ఎంపీపీ ఎర్రబెల్లి రామేశ్వరరావు, సీనియర్ నాయకులు గుజ్జా గంగాధర్ రావు, తాళ్లపెళ్లి భాస్కర్ రావు, గొట్టెముక్కల శ్రీనివాసరావు, మార్నేని ఉపేందర్ రావు, గ్రామ కమిటీ అధ్యక్షులు ఓరుగంటి కృష్ణ, పీట్ల రంజిత్, నాయకులు మండ అశోక్ , దూడపాక దుర్గ,య్య బుర్ర రాజగోపాల్, మామిడి నరసింహస్వామి, పోషాల మహేశ్, మేకల పూర్ణచందర్, నేరెల్ల రాజు, నక్క కుమార్, సాంబరాజు దేవేందర్, మండ ప్రశాంత్, పసుల రంజిత్, సమీర్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments