Sunday, May 19, 2024
Homeలేటెస్ట్ న్యూస్12నుంచి 3 గంటల మధ్య బయటికిరావొద్దు..

12నుంచి 3 గంటల మధ్య బయటికిరావొద్దు..

మండిపోతున్న ఎండలు..
12నుంచి 3 గంటల మధ్య బయటికిరావొద్దు..
స్పాట్ వాయిస్, బ్యూరో: ఎండలు మండిపోతున్నాయి. భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. శని,ఆదివారాలు వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్‌లోనూ తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు 42-43°C దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రెండు రోజులు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3గంటల ప్రాంతంలో ప్రజలు బయటకు రావద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వడగాల్పుల తీవ్రత ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఈనేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీచేసింది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments