Saturday, November 23, 2024
Homeజిల్లా వార్తలుఅక్రమంగా ఇసుక తరలింపు..

అక్రమంగా ఇసుక తరలింపు..

అక్రమంగా ఇసుక తరలింపు..

-అడుగంటుతున్న భూగర్భ జలాలు

-పట్టించుకోని సంబంధిత అధికారులు

స్పాట్ వాయిస్, మహబూబాబాద్(మరిపెడ): మరిపెడ మండలం భూక్యతండ గ్రామపంచాయతీ పరిధిలోని తేజవత్ తండా సమీపంలోని ఆకేరు వాగు డంపింగ్ నుంచి కొందరు అక్రమార్కులు నిత్యం పదుల సంఖ్యలో ఇసుక తరలిస్తున్నారు. చుట్టూ ఉన్న గ్రామాలైన వీరారం, విస్సంపల్లి, ఉల్లేపల్లి, మరిపెడ బంగ్లా, ఎల్లంపేట తదితర గ్రామాలతో పాటు గిరిజన తండాలకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు రూ. 5000 వేల చొప్పున తీసుకుంటూ రెండు ట్రాక్టర్ల ద్వారా నిత్యం ఇసుకను తరలిస్తున్నారు. ఇదంతా ఓ అధికారి అండతోనే కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు నెలలుగా ఈ అక్రమ ఇసుక దందా మూడు పువ్వులు ఆరుకాయలు కొనసాగిస్తూ లక్షల రూపాయలు దండుకున్నట్లు సమాచారం. ఇసుక తరలించే ట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా లేకపోవడం గమనార్హం. ఓ అధికారి అండగా వీరి దందాకు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతుంది. తేజావత్ తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు నెలల నుంచి ఈ దందాకు తెరలేపినట్లుగా పలువురు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వీరి ట్రాక్టర్లు సీజ్ చేయడంతో పాటు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆకేరు వాగు పరివాహక రైతులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments