Sunday, May 19, 2024
Homeజాతీయంపీఎం సాబ్.. ఇవేవీ..?

పీఎం సాబ్.. ఇవేవీ..?

ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నలు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పలు డిమాండ్లు చేశారు. మోదీ పర్యటనలో బీఆర్ఎస్ నేతలు పాల్గొనడం లేదంటూ మంత్రి నిన్ననే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఉదయం మోదీ పర్యటనపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ…పీఎం నరేంద్ర మోడీజీ. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో వరంగల్‌లో లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. మాకు పూర్తిగా నిరాశ కలిగించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం అదే ఫ్యాక్టరీని రూ. 20,000 కోట్ల పెట్టుబడితో గుజరాత్‌కు తరలించింది. రూ.520 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ప్రతిపాదించబడుతున్న వ్యాగన్ రిపేర్ షెడ్ తెలంగాణ ప్రజలను అవమానించడమే. తెలంగాణకు ద్రోహం చేయడమే’’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.


ట్రైబర్ వర్సిటీపై నిర్లక్ష్యం ఏలా..?
ఏపీ విభ‌జ‌న చ‌ట్టం కింద ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయాల్సి ఉంద‌న్నారు. ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు కోసం ఆరేళ్ల క్రిత‌మే ములుగులో 350 ఎక‌రాల స్థలాన్ని కేంద్రానికి అప్పగించిన‌ట్లు మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ అక్కడ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయ‌డంలో దారుణంగా విఫ‌ల‌మైంద‌న్నారు. కీల‌క‌మైన ఆ ఇన్స్‌టిట్యూష‌న్ కోసం కేంద్రం నిధుల‌ను విడుద‌ల చేయ‌డం లేద‌న్నారు. గిరిజ‌న యూనివ‌ర్సిటీ ఏర్పాటు విష‌యంలో నిర్లక్ష్యాన్ని, తెలంగాణ ప్రజ‌ల ప‌ట్ల స‌వ‌తి త‌ల్లి ప్రేమ‌ను వీడాల‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments