Sunday, May 19, 2024
Homeలేటెస్ట్ న్యూస్కవితకు బెయిల్ నిరాకరణ

కవితకు బెయిల్ నిరాకరణ

స్పాట్ వాయిస్, బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కవిత తన చిన్న కొడుక్కు పరీక్షలు ఉన్నందున ఈ నెల 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్​లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఏప్రిల్‌ 4న ఉత్తర్వులు రిజర్వ్‌ చేసి సోమవారం తీర్పు వెలువరించింది. ఇక మంగళవారంతో జ్యుడీషియల్‌ కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆమెను రేపు మరోసారి కోర్టు ఎదుట హాజరు పరిచే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments