Sunday, May 19, 2024
Homeకెరీర్11న గ్రూప్-1 ఎగ్జామ్

11న గ్రూప్-1 ఎగ్జామ్

గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్‌ 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించేదుకు టీఎస్ పీఎస్సీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీలపై విచారణ కొనసాగుతుందని.. ఈ సమయంలో పరీక్ష ఎలా నిర్వహిస్తారంటూ పలువురు కోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. వీటిపై సోమవారం విచారించిన హైకోర్టు.. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు అభ్యంతరం లేదని.. నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఇప్పటికే లక్షా 20 వేల మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. గ్రూప్ 1 పరీక్షను టీఎస్ పీఎస్సీ పరిధిలో నిర్వహించకూడదని పిటీషనర్లు వాదించారు. పేపర్లు లీక్ అయిన పరీక్షలను మళ్లీ నిర్వహించకుండా.. హడావిడిగా గ్రూప్ 1 ఎందుకు నిర్వహిస్తున్నారంటూ పిటీషనర్ల తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించకూడదని వాదించారు. ఈ వాదనను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు అని.. దర్యాప్తు తీరుపై కోర్టులు నిర్ణయం తీసుకుంటాయని.. అందులో భయపడాల్సిన అవసరం లేదంటూ.. పిటీషనర్లను ఉద్దేశించి హై కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో 11న గ్రూప్ 1 పరీక్ష నిర్వహించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments