Sunday, May 19, 2024
Homeజాతీయంతెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్నాం..

తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్నాం..

ప్రధాని మోడీ నరేంద్ర మోడీ
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వరంగల్ పర్యటనకు వచ్చిన పీఎం ముందుగా భద్రకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీకి చేరుకున్న ఆయన 6వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు అంటూ తెలుగులో మోడీ ప్రసంగం ప్రారంభించారు. మోదీ తెలంగాణ ఏర్పడి 9ఏళ్లు పూర్తయిందన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర అని చెప్పారు. మోదీ ఆర్థిక వృద్ధిలోనూ తెలంగాణది ప్రధాన భూమిక పోషిస్తోందన్నారు. మోడీ దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందని చెప్పారు. దేశాభివృద్ధి కోసం శరవేగంగా పనులు పూర్తిచేస్తున్నామన్నారు. అనేక ఆర్థిక కారిడార్లను పూర్తి చేసుకుంటున్నామని, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇండస్ట్రియల్‌-ఎకనామిక్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయని, కరీంనగర్‌ గ్రానైట్‌ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తుందని తెలిపారు. రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నామని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments