పెద్దల హస్తంలో జాబితా
ఎవరెవరి పేర్లు ఉన్నాయంటే..
స్పాట్ వాయిస్, బ్యూరో: కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ బరిలో నిలిచే ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. మరో 24 గంటల్లో పోటీలో నిలిచే అభ్యర్థుల జాబితా రానుంది. తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం సమావేశం కానుంది. అయితే అభ్యర్థుల ఎంపిక బాధ్యత రేవంత్ కి అధిష్ఠానం అప్పజెప్పింది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను రేవంత్ హై కమాండ్‌కి వివరించనున్నారు. తెలంగాణలో మరోసారి సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ ఆ మేరకు అభ్యర్థుల ఎంపికలోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏకాభిప్రాయం ఉన్న సీట్లను తొలి జాబితాలో ఏఐసీసీ గురువారం ప్రకటించనుంది.
వరంగల్ నుంచి..
వరంగల్ పార్లమెంట్: దొమ్మాటి సాంబయ్యతో పాటు స్టేషన్ ఘన్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఇందిర పేరును ప్రతిపాదించినట్లు సమాచారం.
మహబూబాబాద్: కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్
ఖమ్మం: మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి సతీమణి నందిని, మంత్రి తుమ్మల కొడుకు యుగందర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
కరీంనగర్: అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి లేదా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
పెద్దపల్లి : గడ్డం వంశీకృష్ణ, లేదా మాజీ ఎంపీ
నిజామాబాద్ : మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్ : మాజీ ఎంపీ మల్లు రవి
మెదక్: నీలం మధు ముదిరాజ్
జహీరాబాద్: మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, ఉజ్వల రెడ్డి సిద్ధా రెడ్డి
సికింద్రాబాద్: మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ లేదంటే ఆయన భార్య శ్రీదేవి,
చేవెళ్ల: సునీత మహేందర్‌రెడ్డి
మహబూబ్‌నగర్: ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి
నల్గొండ: పటేల్ రమేశ్‌రెడ్డి లేదా జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి
భువనగిరి: పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ రెడ్డి, లేదా కోమటిరెడ్డి సోదరుడి కొడుకు సూర్యపవన్ రెడ్డి
మల్కాజిగిరి: బీసీ నాయకుడి కోసం వెతుకులాట
ఆదిలాబాద్: మాజీ ఎంపీ కోసం వెయిటింగ్
హైదరాబాద్: మస్కతి డెయిరీ యజమానికి టికెట్
Recent Comments