Sunday, May 19, 2024
Homeజిల్లా వార్తలుపోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ బర్త్ డే..

పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ బర్త్ డే..

పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ బర్త్ డే..

మొగుళ్లపల్లి ఎస్సైకి మెమో.. 

స్పాట్ వాయిస్, మొగుళ్లపల్లి: జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా మొగుళ్లపల్లి పోలీసు స్టేష‌న్‌లో రౌడీ షీటర్ బర్త్ డే వేడుకలు జరపడం చర్చకు దారితీసింది. హ‌త్యా కేసుల్లో నిందితుడైన రౌడీషీట‌ర్ పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఎస్సై నిర్వహించిన ఘ‌ట‌న ఆదివారం రాత్రి చోటు చేసుకోగా, మంగ‌ళ‌వారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మొగుళ్లపల్లి పోలీసు స్టేష‌న్ ఎస్సై టి. మాధ‌వ్ గౌడ్.. వీ మ‌హేంద‌ర్ గౌడ్ అనే రౌడీషీట‌ర్ బ‌ర్త్‌డే వేడుక‌ల‌ను ఆదివారం రాత్రి నిర్వహించారు. జిల్లా ప‌రిధిలోని అనేక పోలీసు స్టేష‌న్లలో మ‌హేంద‌ర్ గౌడ్ పేరు మీద రౌడీషీట్ ఓపెన్ చేశారు. పోలీసు స్టేష‌న్లలోని నోటీసు బోర్డుల్లో కూడా మ‌హేంద‌ర్ ఫొటోను ఉంచారు. రౌడీషీట‌ర్ ఆగ‌డాలు తెలిసిన‌ప్పటికీ.. ఎస్సై మాధ‌వ్ బ‌ర్త్ డే వేడుక‌లు నిర్వహించ‌డం పోలీసు వ‌ర్గాల్లో చ‌ర్చనీయాంశంగా మారింది. ఆదివారం వేడుకలు జరుపగా.. సెల‌బ్రేష‌న్స్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై భూపాల‌ప‌ల్లి డీఎస్పీ ఏ సంప‌త్ రావు స్పందించారు. ఎస్సై మాధ‌వ్‌కు మెమో కూడా జారీ చేసిన‌ట్లు పేర్కొన్నారు. విచార‌ణ జ‌రిపి చ‌ర్యలు తీసుకుంటామ‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments