Sunday, May 19, 2024
Homeజిల్లా వార్తలుకల్లుగీత కార్మిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

కల్లుగీత కార్మిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

కల్లుగీత కార్మిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

స్పాట్ వాయిస్, గణపురం:తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం 2024 నూతన క్యాలెండర్ ను ఆదివారం మండలం కేంద్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు బత్తిని శివశంకర్ గౌడ్ గీత కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించి, కల్లు దుకాణాలు కోసం ప్రభుత్వం నిధులు కేటాయించాలని, అలాగే చెట్ల పెంపకానికి గ్రామాల్లో భూములు కేటాయించి గీత వృత్తిని మరింత బలోపేతం చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ గ్రామాన విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ఏర్పాటుతో కల్లు అమ్ముడుపోక గీత కార్మికుల కుటుంబాలు రోడ్డుపై పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రాలలో “నీరా” కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కల్లుగీత కార్మికుల హక్కుల కోసం సర్వాయి పాపన్న స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు మార్క కొమురయ్య గౌడ్, కార్యదర్శి సమ్మయ్య గౌడ్, మాజీ అధ్యక్షుడు అరెల్లి శంకర్ గౌడ్, రాజు గౌడ్, రాజగోపాల్ గౌడ్, మొగిలి గౌడ్, వెంకటేశ్వర్లు గౌడ్, సంఘం నాయకులు అర్జున్ గౌడ్, స్వామి గౌడ్, చిన్న మొగిలి గౌడ్, రామ్మోహన్ గౌడ్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments