Monday, May 20, 2024
Homeరాజకీయంవరంగల్ ఎంపీ బరిలో బాబూ మోహన్..

వరంగల్ ఎంపీ బరిలో బాబూ మోహన్..

వరంగల్ ఎంపీ బరిలో బాబూ మోహన్..
పార్టీ మారి మరి పోటీలో..
స్పాట్ వాయిస్, బ్యూరో: సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్‌ వరంగల్ ఎంపీగా బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. బాబూమోహన్.. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భవిష్యత్తులో వరంగల్ జిల్లా ఎంపీగా పోటీ చేస్తానని రాజీనామా సమయంలోనే బాబూ మోహన్‌ వెల్లడించారు. ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న ఆయన సోమవారం కేఏపాల్‌ సమక్షంలో సోమవారం ప్రజాశాంతి పార్టీ కండువా కప్పుకున్నారు. కేఏ పాల్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments