కేటీఆర్‌పై క్రిమినల్ కేసు
స్పాట్ వాయిస్, బ్యూరో: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్‌రెడ్డి పలువురు కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద సుమారు రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపించాడని కేటీఆర్ చేసిన ఆరోపణలపై పోలీసులు ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద ఆయనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం హనుమకొండ పోలీస్‌స్టేషన్‌లో స్థానిక కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బంజారాహిల్స్ పీఎస్‌కు పంపించారు. దీంతో కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
Recent Comments