Saturday, November 23, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద గౌడ్
స్పాట్ వాయిస్, టేకుమట్ల: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ అన్నారు. జయశంకర్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయక్ ఆధ్వర్యంలో తేజస్విని జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర సంఘ అధ్యక్షుడు సదానంద్ గౌడ్ హాజరై మాట్లాడారు. విద్యారంగంలో రెండు దశాబ్ధాలగా ఎన్నో సమస్యల పేరుకుపోయాయని నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో మన సమస్యల పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న డీఏ లు వెంటనే విడుదల చేయాలని, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాని,
ఉపాధ్యాయులు పదోన్నతుల సమస్య దశాబ్ద కాలంగా పెండింగ్ ఉండడం సమంజసం కాదన్నారు. అలాగే ఉపాధ్యాయ ఖాళీలన్నింటిని వెంటనే భర్తి చేయాలని లేకపోతే విద్యా వాలంటీర్లను నియమించి ఉపాధ్యాయులల కొరత తీర్చాలి అన్నారు. పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులను వెంటనే నియమించాలన్నారు. పాఠశాలకు కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలన్నారు. ప్రతి గ్రామంలో పాఠశాలలను తెరవాలనడం స్వాగతించ దగిన పరిమాణం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సదయ్య, రాష్ట్ర అదనపు కార్యదర్శి సుర రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాల గణేష్, సీనియర్ నాయకులు ప్రవీణ్, రమేష్ నాయక్, మండలాల బాధ్యులు వేణు, సదయ్య, నీలిమా రెడ్డి, బొమ్మ రాజమౌళి, రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments