సూపర్ మార్కెట్ ని ప్రారంభించిన కొయ్యూరు ఎస్సై
స్పాట్ వాయిస్,మల్హర్:జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని కొయ్యూరు చౌరస్తా వద్ద అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన శ్రీ సాయి గణేష్ సూపర్ మార్కెట్‌ను బుధవారం కొయ్యూరు ఎస్సై వడ్లకొండ నరేష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా సూపర్ మార్కెట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సూపర్ మార్కెట్ నిర్వాహకులు మాట్లాడుతూ కొయ్యూరు సమీప గ్రామ ప్రజలకు నాణ్యమైన వస్తువులు అందుబాటులోకి తీసుకురావడానికి సూపర్ మార్కెట్ ఏర్పాటు చేశామని,ఇందులో అన్ని రకాల నిత్యావసర సరకుకు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో కొయ్యూరు, అడవి సోమన్ పల్లి సర్పంచులు సిద్ది లింగమూర్తి, కోటారి శారద బాపు, ఎంపీటీసీ మండపు రామ్ భాయి, ఉప సర్పంచ్ మమత, బీఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షులు ఎం.డీ. తాజోద్దిన్, మండల కో ఆప్షన్స్ సభ్యులు ఎండి అయూఖ్ ఖాన్, సింగిల్ విండో డైరెక్టర్ రమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Recent Comments