Sunday, May 19, 2024
Homeసినిమాహీరో విక్రమ్ కి ప్రమాదం..

హీరో విక్రమ్ కి ప్రమాదం..

హీరో విక్రమ్ కి ప్రమాదం..

విరిగిన పక్కటెముకలు

స్పాట్ వాయిస్, డెస్క్: అపరిచితుడు మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ స్టార్ హీరో విక్రమ్ కి ప్రమాదం జరిగింది. ఆయన హీరోగా వస్తున్న తంగలాన్ షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విక్రమ్ తీవ్రంగా గాయపడ్డారట. విక్రమ్ కి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్స్ ఆయన పక్కటెముకలు విరిగాయని, వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారు.

షూటింగ్ లో…

విక్రమ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ తంగలాన్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోలార్ గోల్డ్ ఫీల్డ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమా కోసం తెరకెక్కిస్తున్న ఒక యాక్షన్ ని సీక్వెన్స్ లోనే విక్రమ్ కి ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments