Wednesday, December 4, 2024
Homeక్రైమ్గ్రూప్- 4 లో మార్కులు తక్కువొచ్చాయని యువతి ఆత్మహత్య..

గ్రూప్- 4 లో మార్కులు తక్కువొచ్చాయని యువతి ఆత్మహత్య..

మహబూబాబాద్‌ జిల్లా ముప్పారంలో విషాదం..
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్( టీఎస్ పీఎస్‌సీ) ఇటీవల వెలువరించిన గ్రూప్-4 ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని మహబూబాబాద్ జిల్లా ముప్పారం గ్రామానికి చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ చిక్కడపల్లి పరిధిలోని జవహర్ నగర్ పరిధి ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న శిరీష (24) గ్రూప్ 4 లో మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపానికి గురై ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments