Sunday, May 19, 2024
Homeజనరల్ న్యూస్ఆరుగురు భార్యలు.. 20 అడుగులు బెడ్..

ఆరుగురు భార్యలు.. 20 అడుగులు బెడ్..

ఆరుగురు భార్యలు..
20 అడుగులు బెడ్..
స్పాట్ వాయిస్, డెస్క్: ఒక భార్యతోనే వేగలేని రోజులివి. ఉదయం లేచింది మొదలు అలకలు.. గొడవలు. అయితే అతగాడికి ఆరుగురు భార్యలు. ఇంతకు ఆ మగ అణిముత్యం ఎవరునుకుంటున్నారా..? బ్రెజిల్‌కు చెందిన ఆర్థర్ ఓ ఉర్సో‌కు ఆరుగురు భార్యలు. ఒకరికొకరు పరిచయం లేకున్నా ఆరుగురు భార్యలు కలిసిమెలిసి ఉండేవారట. కానీ భర్తతో బెడ్ పంచుకునే విషయం దగ్గర కాస్త ఆలోచనలో పడేవారట. చీకటి పడుతోందంటే అలకలు మొదలయ్యేవట. ఏ ఒక్కరితో అతడు నిద్రపోయినా.. మిగిలిన వారిలో మిస్ అవుతున్నామనే ఫీలింగ్. దీని పరిష్కారం కోసం ఇంటర్నెట్ లో శోధించగా ఓ కత్తిలాంటి ఐడియా తట్టింది. అందుకే, అందరికీ కలిపి ఒక బెడ్ ఉండాలన్న ఆలోచన చేశాడట.

అంతా తలోదిక్కు నిద్రపోడానికి బదులు.. ఒకే చోట నిద్రపోతే ఎంతో హాయిగా ఉంటుందని భావించి.. ఒక పెద్ద మంచాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడట. ఆ ఆలోచన ఫలితమే ఈ 20 అడుగుల బెడ్. ఈ మంచం తయారీ కోసం ఆర్థర్ 80 వేల పౌండ్లు వెచ్చించాడని తెలిపాడు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.80 లక్షలు పైమాటే. 20 అడుగుల వెడల్పు, 7 అడుగుల పొడవు ఉండే ఈ మంచాన్ని 12 మంది సిబ్బంది 15 నెలల పాటు శ్రమించి తయారుచేశారట. మొత్తం 950 స్క్రూలతో ఈ మంచాన్ని బిగించారట. ప్రస్తుతానికి అతడు ఎలాంటి చీకూ చింత లేకుండా అందరితో కలిసి దానిపై హాయిగా నిద్రిస్తున్నాడట. ఈ ఘనకార్యాలను ఆర్థర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. భార్యలతో ఉన్న ఫొటోను, తన 20 అడుగుల మంచం ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మంచమంటూ చెప్పుకొచ్చాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments