Sunday, May 19, 2024
Homeజనరల్ న్యూస్బ్యూటీ పార్లర్ కు వద్దంటే ఉరి వేసుకుంది...

బ్యూటీ పార్లర్ కు వద్దంటే ఉరి వేసుకుంది…

స్పాట్ వాయిస్, డెస్క్ : బ్యూటీ పార్లర్ కు వెళ్లొద్దని చెప్పినందుకు వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో జరిగింది. ఇండోర్‌ పట్టణంలోని ఎరోడ్రోమ్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసించే రీనా యాదవ్‌.. గత గురువారం ఉదయం తన భర్త విధులకు వెళ్తుండగా.. తాను బ్యూటీపార్లర్‌కు వెళ్తానని అడిగింది. అందుకు భర్త నిరాకరించాడు. అక్కర్లేదని చెబుతూ డ్యూటీకి వెళ్లిపోయాడు. అతను డ్యూటీ నుంచి తిరిగి వచ్చేసరికి రీనా యాదవ్‌ ఇంట్లోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments