Sunday, May 19, 2024
Homeకెరీర్ఇంటర్ ఫలితాల్లో షైన్ ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో షైన్ ప్రభంజనం

రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకులు
ఉమ్మడి జిల్లాలో పోటీలేని విద్యాసంస్థ
నాణ్యమైన విద్యవల్లే ర్యాంకులు
షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్
స్పాట్ వాయిస్, హన్మకొండ టౌన్: షైన్ ప్రభంజనం సృష్టించింది. మరోసారి ఇంటర్ లో తమకు తిరుగులేదని నిరూపించుకుంది. స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో అదరగొట్టింది. మంగళవారం వచ్చిన ఇంటర్ ఫలితాల్లో షైన్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ఎంపీసీ, బైపీసీలో ఫస్ట్ ర్యాంకు సాధించారు. కార్పొరేటర్ సంస్థలకు దీటుగా ఆల్ రౌండ్ ఫలితాలు అద్భుతంగా వచ్చాయి. షైన్ కాలేజీకి ర్యాంకులు క్యూ కట్టడంతో.. మంగళవారం షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్, డైరెక్టర్లు పి. రాజేంద్ర కుమార్, మూగల రమ, షైన్ రెసిడెన్షియల్ స్కూల్ క్యాంపస్ డైరెక్టర్ జే. శ్రీనివాస్, ఐఐటీ కో ఆర్డినేటర్ మూగల రమేశ్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. షైన్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో నంబర్ వన్ గా నిలిచారన్నారు. ఇంటర్ ఫస్ట్, సెంకడియర్ ఫలితాలలో షైన్ జూనియర్ కాలేజీ అత్యుత్తమ ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఉత్తమ ర్యాంకులు తమ కాలేజీ విద్యానైపుణ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతితక్కువ ఫీజులతో అనుభవమైన లెక్చరర్స్ తో నాణ్యమైన విద్యా అందిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు సైతం చక్కటి అకాడిమిక్ ప్రోగ్రామింగ్, ప్రణాళికల ద్వారా అణిముత్యాలుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

*బైపీసీ ఫస్ట్ ఇయర్ లో టి. హేమప్రియ 437, ఆర్. వైష్ణవి 437 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు.
*ఎంపీసీ ఫస్ట్ ఇయర్ లో ఎమ్. అక్షయ 467 మార్కులు, తుత్తూరు విజయ్ 466 మార్కులు, వి. సరయు 466 మార్కులు, పి. మనోజ్ కుమార్ 466 మార్కులు సాధించారు.
*ఎంపీసీ సెకండియర్‌లో డి. సుప్రియ 990 మార్కులు, వి. శ్వేత 989 మార్కులు, టి. రాహిత్య 988 మార్కులు సాధించారు.
* బైపీసీ రెండో సంవత్సరంలో డి. క్రీజ 988 మార్కులు, పస్పియా అర్బిన్ 984 మార్కులు, డి. అమృత 983 మార్కులు, ఎస్. రితికుమార్ 982 మార్కులు సాధించారు.
వీరితో పాటు సెకండియర్ ఎంపీసీలో 970 మార్కుల పైన 35 మంది విద్యార్థులు, బైపీసీలో 970 మార్కుల పైన 28 మంది విద్యార్థులు సాధించారు. అలాగే మొదటి సంవత్సరం ఎంపీసీలో 460 మార్కుల పైన 58 మంది విద్యార్థులు, బైపీసీలో 430 మార్కుల పైన 38 మంది విద్యార్థులు సాధించారు. ఈ కార్యక్రమంలో షైన్ విద్యాసంస్థలు కళాశాల ప్రిన్సిపాల్స్ మారబోయిన రాజు గౌడ్, కొత్తకొండ శ్రీనివాస్, అధ్యాపక బృందం, విద్యార్థులు, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments