Sunday, May 19, 2024
Homeజనరల్ న్యూస్కాంగ్రెస్ హయాంలోనే బంజారాలకు గుర్తింపు

కాంగ్రెస్ హయాంలోనే బంజారాలకు గుర్తింపు

15 ఐచ్చిక సెలవు ప్రకటన హర్షనీయం
ఏళ్లు గడచినా పట్టించుకోని గత పాలకులు
కాంగ్రెస్ లంబాడా నాయకుడు విజయ్
స్పాట్ వాయిస్, మహబూబాబాద్ (మరిపెడ): బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరినా గత పాలకులు పట్టించుకోలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ చొరవ, రాష్ట్ర వ్యాప్త కాంగ్రెస్ బంజారా నాయకుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 15వ న సేవాలాల్ జయంతిని అధికారికంగా గుర్తించటం హర్షనీయమని మరిపెడ మండల కాంగ్రెస్ నాయకుడు విజయ్ నాయక్ అన్నారు. ఆదివారం మరిపెడ ఆర్అండ్ బీ అతిథి గృహం ఎదుట మరిపెడ పట్టణ అధ్యక్షుడు షేక్ తాజోద్దీన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ చిత్ర పటాలకు బంజారా నాయకులు క్షీరాభిషేకం చేశారు. అనంతరం విజయ్ నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల చుట్టూ బంజారులం ఎన్నో ఏళ్ల తరబడి వినతి పత్రాలు పట్టుకుని తిరిగినా సేవాలాల్ మహరాజ్ ను గుర్తించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన రెండు నెలల్లోనే ఫిబ్రవరి 15ర ఐచ్చిక సెలవు దినంగా ప్రకటించి సేవాలాల్ మహరాజ్ జయంతి నిర్వహించటం హర్షనీయమన్నారు. తమ జాతి బాగు కోసం అహర్నిషలూ పాటు పడిన సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అందుకు చొరవ చూపిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా జయంతి రోజున బంజారా భవన్ లో సేవాలాల్ విగ్రహం ఏర్పాటు, ట్యాంక్ బండ్ పై విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామనటం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు దస్రు నాయక్, అజ్మీర శ్రీను నాయక్, నెహ్రూ నాయక్, శీను నాయక్, విజయ్ నాయక్, నరేష్ నాయక్, మహేష్ నాయక్, సురేష్ నాయక్, పాపులాల్ నాయక్, రవీందర్ నాయక్, వీరన్న నాయక్, ప్రసాద్ నాయక్, వెంకన్న నాయక్, రమేష్ నాయక్, గణేష్ నాయక్, జితేందర్, జిల్లా మైనార్టీ నాయకుడు అప్సర్, బోర గంగయ్య, కాంగ్రెస్ వీరారం నాయకుడు బుర్ర నవీన్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments