Sunday, May 19, 2024
Homeజాతీయం500 ఏళ్ల కల..రామ్‌లల్లా

500 ఏళ్ల కల..రామ్‌లల్లా

500 ఏళ్ల కల..రామ్‌లల్లా

మరికొన్ని గంటల్లో ప్రాణ ప్రతిష్ఠ

వెలగనున్న రామజ్యోతి

స్పాట్ వాయిస్, బ్యూరో: అయోధ్యలోని రామ మందిరంలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయోధ్య నగరమంతా ఆధ్యాత్మిక రంగులతో ముస్తాబు అయ్యింది. ఈ వేడుకకి ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రధాన రాజకీయ నేతలు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు, సాధువులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు.

 

500 ఏళ్ల కల..

500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. మరి కొద్ది గంటల్లో సాకారం కానుంది. అయోధ్యలోని రామ మందిరంలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమై 1 గంటకు ముగియనుంది. అఖండ భారతదేశ జనం జయజయ నాదాలా నడుమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7 వేల మంది పాల్గొంటున్నారు. పలువురు ప్రముఖులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు.

సర్వాంగ సుందరంగా

ప్రాణ ప్రతిష్ఠ కోసం శ్రీరామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఇక అయోధ్య నగరం భద్రతా వలయంలోకి వెళ్లింది. పలు కంపెనీల బలగాలతో కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చేశారు. భారత్‌తో పాటు యావత్‌ ప్రపంచ దేశాలు ప్రాణ ప్రతిష్ఠ చారిత్రక ఘట్టం కోసం ఎదురుచూస్తోంది.

వెలగనున్న రామజ్యోతి

రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో ‘రామజ్యోతి’ వెలిగించి.. దీపావళి తరహాలో ఘనంగా వేడుకల్ని నిర్వహిస్తారు. అయోధ్యలోని సరయూ నది ఒడ్డున ఉన్న ‘రామ్ కీ పౌరి’ వద్ద 5 లక్షల దీపాలు వెలిగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో పాటు దుకాణాలు, సంస్థలు, ఇళ్లు, ఇతర పౌరాణిక ప్రదేశాల్లో రామజ్యోతిని వెలిగించనున్నారు. రామ్‌లల్లా, హనుమాన్‌గర్హి, గుప్తర్‌ఘాట్, సరయూ బీచ్, కనక్ భవన్, లతా మంగేష్కర్ చౌక్, మణిరామ్ దాస్ కంటోన్మెంట్ సహా 100 దేవాలయాలు, ప్రధాన కూడళ్లు, బహిరంగ ప్రదేశాల్లో దీపాలు వెలిగిస్తారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments