వర్ష భయం..
చెరువుల్లా మారిన లోతట్టు ప్రాంతాలు..
నీటిలోనే వరంగల్ బట్టల బజారు
స్పాట్ వాయిస్, బ్యూరో : వర్షం జోరుగా కురుస్తోంది. సోమవారం సాయంత్రం మొదలైన వాన మంగళవారం సైతం కొనసాగుతోంది. భారీగా పడుతున్న వానతో లోతట్టు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. గ్రేటర్ వరంగల్ లోని ముంపు ప్రాంతాలు భయoతో వణికిపోతున్నాయి. వరంగల్ బట్టల బజారులోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం కూడలి చెరువులా మారిపోయిoది.
రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మంగళవారం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే.. మిగిలిన జిల్లాల్లోనూ మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. మూడు రోజుల పాటు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Recent Comments