బీ అలర్ట్
స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. బుధవారం నుంచి గురువారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్‌లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో వానలు పడుతాయని పేర్కొంది. శుక్రవారం నుంచి శనివారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్‌తో పాటు జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలుపడుతాయని చెప్పింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్‌తో పాటు జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు..
RELATED ARTICLES
Recent Comments