తాను- నేను
……………………
(భార్యాభర్తల అనుబంధంపై ఫిబ్రవరి 11 ప్రామిస్ డే సందర్భంగా..)
నేను తనువును అయితే
తాను ప్రాణంగా
నేను హృదయం అయితే
తన స్పందనగా
నేను నడకనైతే
తాను గమ్యంగా
నేను పదమును అయితే
తాను భావంగా
నేను నయనం అయితే
తాను దృశ్యంగా
నేను శ్వాసను అయితే
తాను ఊపిరిగా
నేను అలిగితే
తాను లాలనగా
నేను అల్లరిని అయితే
తాను శాంతంగా
నేను తీగను అయితే
తాను పందిరిగా
నేను కురులను అయితే
తాను కుసుమాలుగా
నేను కెరటాన్ని అయితే
తాను సాగరంగా
నేను కాలాన్ని అయితే
తాను దీర్ఘాయువుగా
నేను మనువు అయితే
తాను మాంగల్యముగా మరో జన్మకైనా నీవే
నేనే తాను తానే నేనుగా మాట ఇవ్వమని నా జీవిత భాగస్వామిని కోరుకుంటున్న ప్రాణ సఖి…
-మడికొండ స్వరూప. పీజీసీఆర్టీ., తెలుగు( కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం టేకుమట్ల.)
Recent Comments