విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వరంగల్లో నిరసన వ్యక్తమవుతోంది. ప్రధాని రాకను నిరసిస్తూ వరంగల్ పట్టణంలో ఫ్లెక్సీలు, పోస్టర్లు భారీగా వెలిశాయి. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ‘నేను వరంగల్-నాది తెలంగాణ’ అనే పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మామునూరు ఎయిర్పోర్టు ఏమైంది మోదీ?.., గిరిజన విశ్వవిద్యాలయం ఏది?, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏమైంది? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ఏమయ్యాయని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో పర్యటించే ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వరంగల్ లో ఫ్లెక్సీలు..
RELATED ARTICLES
Recent Comments