Tuesday, December 3, 2024
Homeసినిమా‘దర్జా’ పోస్టర్ రిలీజ్..

‘దర్జా’ పోస్టర్ రిలీజ్..

స్పాట్ వాయిస్, హైదరాబాద్: ‘దర్జా’ సినిమా మంచి విజయం సాధించి, చిత్రంలో చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు యాక్షన్ కింగ్ అర్జున్. కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పీఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలోని సునీల్‌ పాత్రకి సంబంధించిన మోషన్ పోస్టర్‌ని తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోషన్ పోస్టర్ చాలా బాగుందని కితాబిచ్చారు. చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటితో పాటు షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), హీరోయిన్లు అక్సాఖాన్, శిరీష.. సంగీత దర్శకుడు రాప్‌రాక్ షకీల్, సినిమాటోగ్రాఫర్ దర్శన్, స్ర్కిఫ్ట్‌ కో-ఆర్డినేటర్ పురుషోత్తపు బాబీ, పీఆర్వో వీరబాబు, ‘దర్జా’ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments