ఇంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు..
స్పాట్ వాయిస్, క్రైమ్: ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్కరి పేర్లు వెలుగుచూస్తున్నాయి. తాజాగా భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు ను అదుపులో తీసుకున్న పోలీసులు ఆయనను విచారిస్తున్నట్లు తెలిసింది. ఉదయం ఆయన ఇంట్లో సోదాలు సైతం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయనతో పాటు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్, ఎస్ఐబీ అదనపు ఎస్పీ తిరుపతి ఇళ్లల్లోనూ సోదాలు చేపట్టారు. భుజంగరావు ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్ లో పని చేశారు. ప్రణీత్ రావ్, భుజంగరావు, తిరుపతి రావు కలిసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు విచారణలో తెలిసింది.
Recent Comments