Friday, May 23, 2025
Homeతెలంగాణపసునూరి కూడా పాయే....?

పసునూరి కూడా పాయే….?

సీఎం రేవంత్ ను కలిసిన వరంగల్ ఎంపీ
హస్తం గూటికి వెళ్లేందుకు దయాకర్ రెడీ
స్పాట్ వాయిస్, బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలలో బీఆర్ ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు చెందిన నాయకులు కారు దిగి ఇతరపార్టీల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ కారు దిగి కమలం పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. అంతకు ముందే డిప్యూటీ మాజీ సీఎం తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి సీఎంను కలవడం హాట్ టాపిక్ గా మారింరది. ఇక ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావుతో పాటు వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ఏకంగా కాంగ్రెస్ లో చేరారు. రెండు రోజుల క్రితం వరంగల్ ఎంపీ టికెట్ కడియం కావ్యకు కేటాయించడం, సిట్టింగ్ ఎంపీనైన తనకు అవకాశం కల్పించకపోవడంపై పసునూరి దయాకర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాశంగా మారింది. దీంతో ఆయన కారు దిగి హస్తం గూటికి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయం సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments