Sunday, May 25, 2025
Homeరాజకీయంమోడీ ది బాస్..

మోడీ ది బాస్..

బండి సంజయ్..
మార్మోగిన బండి నామస్మరణ
విజయ సంకల్ప సభలో ఆసక్తికర ఘటన
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహిస్తున్న బీజేపీ విజయ సంకల్ప సభ బండి సంజయ్ నామస్మరణతో మార్మోగింది. బండి సంజయ్ ప్రసంగించేందుకు లేచి నిలబడగానే ఈలలు, కేరింతలతో సభ దద్దరిల్లింది. ప్రసంగం ముగిశాక మోదీ సైతం చప్పట్లు కొట్టడం ఆసక్తికరంగా మారింది. జై శ్రీరామ్ అంటూ బండి సంజయ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మోడీ ప్రంపచానికే బాస్ అని చెప్పారు. భారతీయ జనతా పార్టీ జెండా మోసిన భుజం అన్నా ఇది.. ఒక్కసారి మోడీని దగ్గర నుంచి చూడాలని, మోడీ నోట సంజయ్ అనే పేరు రావాలని కల కన్నానని, నా కల నెరవేరిందన్నారు. నరేంద్రమోదీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు మోదీని ఏ ముఖం పెట్టుకుని వచ్చాడని విమర్శించారని.. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేసే ముఖం పెట్టుకుని వచ్చాడన్నారు. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని రాలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. జై మోదీ నినాదాలు చేసినప్పుడు సభికులు, నేతలు నిలబడ్డారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో రామరాజ్యం స్థాపిస్తామన్నారు. బండి సంజయ్ ప్రసంగం ముగించిన తర్వాత మోదీ చప్పట్లు కొట్టారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments