గేట్ బయటే అడ్డుకున్న ఈడీ అధికారులు..
స్పాట్ వాయిస్, బ్యూరో: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ శ్రేణులు రోడ్లుపైకి వచ్చారు. ఇదిలా ఉంటే కవిత అరెస్ట్ వార్త తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కవిత నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంటనే మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు పలువురు కీలక నేతలు ఉన్నారు. అయితే వారిని నివాసంలోకి రాకుండా ఈడీ, ఐడీ అధికారులు అడ్డుకుంటున్నారు. భారీ భద్రతను మోహరించినప్పటికీ పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు కవిత నివాసానికి చేరుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ లబ్ది కోసమే ఎమ్మెల్సీ కవిత కుట్ర పూరిత అరెస్ట్
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను ప్రశ్నించిన కేటీఆర్
అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారన్న కేటీఆర్
సుప్రీంకోర్టు లో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన కేటీఆర్
కావాలని శుక్రవారం వచ్చారన్న కేటీఆర్
సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దు అంటూ హుకుం జారీ చేస్తున్న ఐడి అధికారుల పైన మండిపడ్డ కేటీఆర్
ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు అవకాశం లేదంటూనే… అరెస్టు అని చెప్పడం పైన తీవ్ర అభ్యంతరం
Recent Comments