Sunday, May 19, 2024
Homeతెలంగాణత్వరలో కేసీఆర్ జైలుకు..

త్వరలో కేసీఆర్ జైలుకు..

ఎంపీ ఎన్నికల్లో బీఆర్ కు ఓటమి తప్పదు
100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేశాం
కాంగ్రెస్ ను విమర్శించే హక్కు కేసీఆర్ కేటీఆర్ కు లేదు..
మంత్రి కొండా సురేఖ
స్పాట్ వాయిస్, వరంగల్ : మద్యం కేసులో కల్వకుంట్ల కవిత జైలులో ఉందని, కేటీఆర్ ఫోన్ టాంపరింగ్ లో సినీ హిరోయిన్ లను బెదిరింపులకు పాల్పడ్డారని, త్వరలో కేసీఆర్ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయే అవకాశం ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ లో సోమవారం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, కడియం కావ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ కొత్త డ్రామాకు తెర తీశారని, ఎంపీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి కేసీఆర్ ఫాంహౌస్ ను విడిచి వచ్చాడన్నారు. అధికారం కోల్పొవడంతో కేసీఆర్, కేటీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, త్వరలో భారాస పార్టీ కనుమరుగవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ని విమర్శించే హక్కు కేసీఆర్ కు లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేటీఆర్ మాట తీరు మానుకోవాలని హితవు చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేశామని ఆమె గుర్తు చేశారు. ధనిక రాష్ట్రాన్ని అయ్యా కొడుకులు అప్పులపాలు చేవారని, రైతులకు రాయితీలను ఎత్తివేసి, రైతు భీమా ఇచ్చారని ఆరోపించారు. ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసి.. రాష్ట్రాను అప్పులపాలు చేశారన్నారు. కేసీఆరే ప్రాజెక్టులను రూపకల్పన చేయడంతో నిర్మాణ లోపంతోనే కాళేశ్వరం దెబ్బతిందన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments