Sunday, April 6, 2025
Homeజిల్లా వార్తలుజర్నలిస్ట్ సార్యయకు నివాళి

జర్నలిస్ట్ సార్యయకు నివాళి

జర్నలిస్ట్ సార్యయకు నివాళి

ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరుఫున

ఆర్థిక సాయం

స్పాట్ వాయిస్, కాటారం: కాటారం మండలానికి చెందిన సీనియర్ రిపోర్టర్ నారమల్ల సారయ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. దీంతో ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు ఆయన స్వగ్రామైన ధన్వాడకు వెళ్లి సారయ్య పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మృతికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సహాయంగా రూపాయలు 5000 అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంతెన సమ్మయ్య జిల్లా అధ్యక్షుడు బండమోహన్ , ప్రధాన కార్యదర్శి అంబాల సంపత్, కోశాధికారి కడపాక రవి, సహాయ కార్యదర్శి మంత్రి రాజబాబు, జిల్లా నాయకులు గుంటి రాములు, ఐజేయూ జిల్లా అధ్యక్షుడు సామంతుల శ్యామ్ , బీసీ సంఘం జిల్లా నాయకులు జాలిగం రాజు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

Recent Comments