Sunday, May 19, 2024
Homeకెరీర్డిగ్రీలో చేరితే రూ.10వేల జీతం

డిగ్రీలో చేరితే రూ.10వేల జీతం

డిగ్రీలో చేరితే రూ.10వేల జీతం
రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం..!
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: విద్యార్థులకు గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రరాజ్యమైన అమెరికాలో ఎలాగైతే చదువుతూనే సంపాదించుకునే సౌకర్యం ఉంటుందో.. అదే తరహాలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరినంతనే నెలకు రూ.10వేల వరకు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ కొత్త పద్ధతిని త్వరలో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి షురూ చేయనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో కాకుండా 103 కాలేజీల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అది కూడా అన్నీ కోర్సుల్లో కాకుండా ఎంపిక చేసిన కొన్ని కోర్సుల్లో చేపట్టి ప్రయోగాత్మకంగా పరిశీలించాలని భావిస్తున్నారు. దీని ఫలితాల ఆధారంగా మరింత మందికి అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కొత్త విధానంలో భాగంగా ఎంపిక చేసిన కోర్సులకు చెందిన విద్యార్థులు వారంలో మూడు రోజులు కాలేజీలో పాఠాలు వినాల్సి ఉంటుందని మరో మూడు రోజులు పని చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. డిగ్రీకి సంబంధించిన అన్ని కోర్సుల్లో కాకుండా పది కోర్సుల్ని ఎంపిక చేశారు. ఈ కొత్త విధానాన్ని ఒక్కో కాలేజీలో ఒకట్రెండు కోర్సులకు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేసి ఫలితాల్ని మదింపు చేస్తారు. దీని ఆధారంగా చేసుకొని విద్యార్థులు ఒకపక్క థియరీ నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ను తెలుసుకునే వీలు కలుగుతుంది. అదే సమయంలో పేద విద్యార్థులకు ఆర్థిక భారంగా ఉండకుండా తల్లిదండ్రులకు మరింత దన్నుగా నిలిచే వీలుందంటున్నారు.
ఇవే కోర్సులు..
– బీబీఏ (రిటైలింగ్)
– బీబీఎస్ (ఈ-కామర్స్)
– బీబీఏ (లాజిస్టిక్స్)
– బీఎస్సీ (ఫిజికల్ సైన్స్)
– బీఏ (కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్)
– బీకాం (ఈ-కామర్స్)
– బీకాం (హాస్పిటల్ మేనేజ్ మెంట్) తదితర కోర్సులు

RELATED ARTICLES

Most Popular

Recent Comments