Wednesday, May 8, 2024
Homeటాప్ స్టోరీస్జీరో బిల్లు రాలేదని టెన్షన్ పడకండి..

జీరో బిల్లు రాలేదని టెన్షన్ పడకండి..

జీరో బిల్లు రాలేదని టెన్షన్ పడకండి..

ఇలా చేయండి
తెలంగాణలో గృహజ్యోతి పథకం అమల్లోకి వచ్చింది. ‘జీరో బిల్స్’ వస్తున్నాయి. అయితే కొందరికి ‘జీరో బిల్స్’ రాకపోవడంతో అందోళన చెందుతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం కీలక సూచనలిస్తోంది. మార్చి మొదటి వారంలో వచ్చే ఫిబ్రవరికి సంబంధించిన బిల్లులు జీరోగా వస్తున్నాయి. అర్హులకు జీరో బిల్స్ జారీ చేయడానికి గాను బిల్లింగ్ మిషన్స్ లో ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ఇన్స్టాల్ చేశారు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తు, రేషన్ కార్డు ఆధారంగా అర్హులైన వారికి బిల్లింగ్ మిషన్స్ లో నుంచి ఆటోమేటిక్ గా జీరో బిల్ వచ్చేలా ఈ సాఫ్ట్ వేర్ రూపొందించారు.అయితే ప్రజాపాలనలో అప్లై చేసి ఉన్నప్పటికీ కొందరికి జీరో బిల్స్ రావడం లేదు. దీంతో జనాల్లో టెన్షన్ నెలకొంది. ప్రభుత్వం చెబుతున్నట్లు తమకు తెల్ల రేషన్ కార్డు ఉందిగా అయినా జీరో బిల్ రాలేదంటే.. తాము ఇక ఈ గృహ జ్యోతి పథకానికి అర్హులం కామేమో అని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల నడుమ పలువురు అధికారులు, ప్రజలకు కీలక సూచనలు చెబుతున్నారు. జీరో కరెంట్ బిల్ రాలేదని టెన్షన్ పడాల్సిన పనిలేదని, జీరో బిల్స్ రానివారు మీ తెల్ల రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు, ఆధార్ కార్డు, జత చేస్తూ స్థానిక మున్సిపల్/MPDO కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని చెబుతున్నారు. ప్రజాపాలనలో అప్లై చేసుకొన్న తెలంగాణ ప్రజలకు ఒకింత ఊరట లభించింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వాడితేనే.. వారికి ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుంది. ఉచితంగా ఇస్తున్నారు కదా..అని ఇష్టానుసారం కరెంట్ వాడితే.. అది 200 యూనిట్లు దాటితే.. మీకు ఉచిత పథకం వర్తించదు. పూర్తి కరెంట్ బిల్లు చెల్లించాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

Recent Comments