13 మంది పేర్లు ఒకేసారి వెల్లడి..
స్పాట్ వాయిస్, బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా రేపు వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలైంది. సోమవారం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ కేవలం నలుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. ఈసారి బీజేపీ దూకుడుగా వ్యవహరించి 17 స్థానాలకు 15 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తోంది. దీంతో కాంగ్రెస్ 13 స్థానాల అభ్యర్థులను వెంటనే ప్రకటించి ప్రచార రంగంలోకి దింపాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో సోమవారం అభ్యర్థులు ఎవరనేదానిపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం సాయంత్రం జరగనుండగా.. ఏఐసీసీ అభ్యర్థులను ఖరారు చేయనుంది. 13 స్థానాలకు మంగళవారం ఓకే సారి అభ్యర్థులను ప్రకటించనుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరుతుండగా.. వారిలో బలమైన నాయకులను హస్తం పార్టీ తరుఫున పోటీలో నిలుపాలని చూస్తున్నట్లు సమాచారం.
Recent Comments