Tuesday, December 3, 2024
Homeటాప్ స్టోరీస్రూ.100 కోట్లను చేర్చడంలో కవితది కీలక పాత్ర

రూ.100 కోట్లను చేర్చడంలో కవితది కీలక పాత్ర

రూ.100 కోట్లను చేర్చడంలో కవితది కీలక పాత్ర

ఈడీ సంచలన ప్రకటన

స్పాట్ వాయిస్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఈడీ సంచలన ప్రకటన చేసింది. మార్చి 15న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించామని, ఆ సమయంలో బంధువులు, అనుచరులు తమ విధులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. తమ దర్యాప్తులో ఆప్‌ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు తేలిందదన్నారు. డిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, మనీష్ సిసోడియాతో కలిసి 2021-22 లో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం పాలసీని రూపొందించారని, హోల్‌సేల్‌ డీలర్ల నుంచి వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకున్నారని,  ఆమ్‌ ఆద్మీ పార్టీకి కవిత రూ.100 కోట్లు చెల్లించారని పేరకొన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు హైదరాబాద్‌, చెన్నై, ముంబయి సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేశామని, మనీష్ సిసోడియా, సంజయ్‌ సింగ్‌, విజయ్‌ నాయర్‌తోపాటు మొత్తం 15 మందిని అరెస్టు చేశామన్నారు. ఈ కేసులో రూ. 128.79 కోట్ల నగదు సీజ్ చేశామని అని  పేర్కొంది. కేసులో ఒక నేరాభియోగపత్రం, 5 అనుబంధ పత్రాలు దాఖలు చేసినట్లు తెలిపిన ఈడీ, ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments