మోరంచసల్లిని ఆవహించిన విషాదం
మూడు కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయిన మృతదేహాలు
ఇద్దరి మృతదేహాలు లభ్యం
స్పాట్ వాయిస్, గణపురం: అతిభారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. భూపాలపల్లి మండలం మోరంచపల్లిని మోరంచవాగు ముంచేసింది. సుమారు 1500 మంది పై చిలుకు జనం ఉండే గ్రామం.. పూర్తిగా మునిగిపోయింది. వరద ఉధృతికి పలువురు గల్లంతయ్యారు. వరద తగ్గుముఖం పడుతుండడంతో మృతదేహాలు బయటపడుతున్నాయి. మొన్న రాత్రి గల్లంతైన గొర్రె ఆదిరెడ్డి – వజ్రమ్మ మృతదేహాలు లభ్యమైంది. దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో మృతదేహాలు కనిపించాయి. తమ వారి మృతదేహాలు బయటపడుతుండటంతో బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మోరంచపల్లిలో వందల సంఖ్యలు బర్రెలు, కోళ్లు మృత్యువాత పడ్డాయి. గొర్రెల మందలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
=====
*మోరంచ వాగు వరదలో గురువారం ఉదయం కొట్టుకపోయిన గొర్రె ఆదిరెడ్డి మృతదేహం చిట్యాల మండలం పాచిగడ్డ తండా శివారు పొలాల్లో లభ్యం.
* సోలిపేట తాళ్లు మండవ దగ్గర కట్ట లోపలిలో ఉన్న పొలాల దగ్గర మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. మోరంచపల్లికి చెందిన గంగిడి సరోజనగా అనుమానిస్తున్నారు.
Recent Comments