Thursday, November 21, 2024
Homeక్రైమ్తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య

తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య

తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య

చెల్పూర్ లో విషాదం

స్పాట్ వాయిస్, గణపురం: తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని చెల్పూర్ గ్రామానికి చెందిన నిఖిల్ (23)ను ఆదివారం చేను వద్దకు వెళ్లమని చెప్పగా నిఖిల్ వెళ్లలేదు. జులాయిగా తిరుగుతున్నావు.. చెప్పిన పని చేయడం లేదని తల్లి మందగించగా మనస్తాపం చెందిన నిఖిల్ సోమవారం ఉదయం గ్రామ శివారులోని చెరువు వద్ద పరుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో చెరువు వద్దకు వెళ్లి చూడగా నిఖిల్ విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు లబోదిబోమంటూ విలపించారు. మృతుడి తండ్రి రాజయ్య పిర్యాదు మేరకు ఎస్ఐ మచ్చ సాంబమూర్తి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments