నామినేటెడ్ పదవుల జాతర..
కుడా చైర్మన్ గా ఇనుగాల..
జంగాకు ఆయిల్ సీడ్స్, గ్రోవర్స్..
బెల్లయ్యనాయక్ కు గిరిజన కో ఆపరేటివ్..
పొడెం వీరయ్యకు ఫారెస్ట్ డెవలప్ మెంట్..
అయిత కు స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ సంస్థ..
స్పాట్ వాయిస్, బ్యూరో: పార్టీ కోసం పని చేసిన నేతలను కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ శాసనసభ నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశించి నిరాశ చెందిన నేతలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిoచింది. శనివారం రాత్రి 37 కార్పొరేషన్లకు చైర్మన్ లను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ముఖ్య నేతలకు పార్లమెంటు ఎన్నికల ముందు నామినేటెడ్ పోస్టులు దక్కాయి. వీరిలో ప్రధానంగా పరకాల, వరంగల్ పశ్చిమ, మహబూబాబాద్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశించిన ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జంగా రాఘవరెడ్డి, బెల్లయ్యనాయక్ తదితరులు ఉన్నారు.
ఏ పదవులంటే..
ఇనుగాల వెంకటరామిరెడ్డికి కీలకమైన కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ పదవి వరించింది. జంగా రాఘవరెడ్డి ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్, గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, బెల్లయ్యనాయక్ గిరిజన కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. భూపాలపల్లి జిల్లా నుంచి అయిత ప్రకాష్ రెడ్డికి స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు.
Recent Comments