Sunday, May 19, 2024
Homeతెలంగాణసీఎం రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ రిలీజ్

సీఎం రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ రిలీజ్

సీఎం రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ రెడీ..

ప్రతి పార్లమెంట్ సెగ్మెoట్ లో పర్యటన

స్పాట్ వాయిస్ , బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. శుక్రవారం ఉదయం మహబూబ్ నగర్‌ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం మహబూబాబాద్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. శనివారం మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.19న మహబూబాబాదు లో పర్యటించనున్నారు. శనివారం (20వ తేదీ) సాయంత్రం కర్ణాటకలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. 21న భువనగిరిలో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 22వతేదీ ఉదయం ఆదిలాబాద్‌లో నిర్వహించే కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 23న నాగర్ కర్నూల్ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 24వ తేదీ ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్‌లో నిర్వహించే సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments