ప్రజల రక్షణే పోలీసుల ధ్యేయం
చెన్నారావుపేట ఎస్సై తోట మహేందర్
స్పాట్ వాయిస్, నర్సంపేట (చెన్నారావుపేట): ఫ్రెండ్లీ పోలీసింగ్ తో సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని, ప్రజల రక్షణే పోలీసుల ధ్యేయమని చెన్నారావుపేట ఎస్సై తోట మహేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెన్నారావుపేట పోలీసుల ఆధ్వర్యంలో చెన్నారావుపేట, కోనాపురం, లింగగిరి గ్రామాల్లో సురక్ష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై తోట మహేందర్ మాట్లాడుతూ ప్రజల రక్షణ ధ్యేయంగా పోలీసు వ్యవస్థ పని చేస్తుందని, ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా అనేక సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. చట్టవ్యతిరేక, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, గంజాయి అరికట్టడానికి ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వీటి ద్వారా నేరాలు జరిగినా తొందరగా నేరస్తులను పట్టుకోవచ్చన్నారు. సైబర్ క్రైమ్ కు ఎవరైనా గురైతే 1930 కి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు కచ్చితంగా లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నారు. మండల ప్రజల సహకారం పోలీసులకు ఉండాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ, సర్పంచులు, ఏఎస్ఐ, పోలీస్ సిబ్బంది ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
ప్రజల రక్షణే పోలీసుల ధ్యేయం
RELATED ARTICLES
Recent Comments