విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తుండగా ఘటన
స్పాట్ వాయిస్, కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా ఘోర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంలో స్కూల్ బస్సు బోల్తా పడింది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బస్సు సోమవారం సాయంత్రం సుమారు 20 మంది విద్యార్థులను ఇంటి వద్ద దింపేందుకు బయలు దేరింది. ఈక్రమంలో మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డులో బోల్తాపడింది. గమనించిన స్థానికులు విద్యార్థులను వెంటనే బయటికి తీశారు. ఈ ఘటనలో విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సు ప్రమాదం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ.. బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీస్తున్నారు.
మానుకోట జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా..
RELATED ARTICLES
Recent Comments