Sunday, November 24, 2024
Homeరాజకీయంనేడు కాంగ్రెస్‌లో చేరేది వీరే..

నేడు కాంగ్రెస్‌లో చేరేది వీరే..

నేడు కాంగ్రెస్‌లో చేరేది వీరే..
కడియం వద్దే వద్దంటూ నిరసనలు..
స్పాట్ వాయిస్, బ్యూరో: బీఆర్ఎస్‌ నుంచి పలువురు కీలక నేతలు శనివారం కాంగ్రెస్‌ లో చేరబోతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌తో బీఆర్ఎస్ నేతలు హస్తంగూటికి క్యూ కడుతున్నారు. ఎంపీ కేశవరావు (కేకే) , ఆయన కూతురు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి చేరనున్నారు. అలాగే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య, ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వీరంతా వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. రేవంత్ నివాసంలో పార్టీలో చేరనున్న నేతలందరికీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి కండువా కప్పనున్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున బరిలో కడియం కావ్య నిలవనున్నారు. ఇక సాయంత్రం 7 గంటలకు కేకే నివాసానికి సీఎం రేవంత్, జానారెడ్డి వెళ్లనున్నారు.
కడియం వద్దే వద్దు..
కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సొంత నియోజకవర్గం స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆ పార్టీ శ్రేణుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్న కడియం శ్రీహరిని కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దంటూ ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సింగపురం ఇందిర ఆధ్వర్యంలో వివిధ మండలాల ముఖ్యనాయకులు, కార్యకర్తలు ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వారంతా ఇన్‌చార్జి దీపాదాస్ మున్షిని కలిసి తమ ఇబ్బందులను చెప్పుకున్నారు. నియోజకవర్గంలో పార్టీ వాస్తవ పరిస్థితులతోపాటు గత 30 ఏండ్లుగా శ్రీహరి నియంతృత్వ ధోర ణి వల్ల పడిన ఇబ్బందులను ఆమెకు వివరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments