నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత కస్టడీ
స్పాట్ వాయిస్, బ్యూరో: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. కోర్టు మొదట ఆమెకు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇవ్వగా పూర్తయింది. తదనంతరం విచారణ ఇంకా మిగిలి ఉందని, మళ్లీ కవిత కస్టడీకి ఇవ్వాలని కోర్టు కోరగా మరో మూడు రోజులు కస్టడీని పొడిగించింది. మూడు రోజుల కస్టడీ సైతం మంగళవారంతో పూర్తికానుంది. దీంతో ఈడీ అధికారులు మళ్లీ కోర్టు ఎదుట కవితను హాజరుపర్చనున్నారు. అలాగే కవిత ట్రయల్ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై సైతం ఈ రోజే రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. కవిత కస్టడీ ముగుస్తున్న కారణంగా కవితను మరో నాలుగురోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.
నేడు కీలకం..
ఇక మంగళవారం కవిత బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నది కొద్దిసేపట్లో తేలనుంది. ఈడీ మళ్లీ విచారణ కోసం కస్టడీకి కోరితే ఇందుకు కోర్టు అనుమతి ఇస్తే మళ్లీ కవితను ఈడీ ఆఫీసుకు, బెయిల్ రాకుంటే, ఈడీ కస్టడీకి ఇవ్వకుంటే ఆమెను రిమాండ్ కోసం తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉంది. మొత్తంగా కవితకు మంగళవారం బిగ్ డే అని చెప్పాలి. బెయిల్ వస్తుందా రాదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
బెయిలా..? జైలా..!
RELATED ARTICLES
Recent Comments