Friday, November 22, 2024
Homeరాజకీయంఅరూరి@ బీఆర్ఎస్, బీజేపీ

అరూరి@ బీఆర్ఎస్, బీజేపీ

అరూరి@ బీఆర్ఎస్, బీజేపీ
టికెట్ కోసం పోటీ..
అరూరి రమేశ్ నిర్ణయం కోసం వెయింటింగ్

స్పాట్ వాయిస్, ఓరుగల్లు:  వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో ఆసక్తికర అంశం వైరల్ అవుతోంది. కాంగ్రెస్ లో ఆశావహులు భారీగా పెరిగిపోగా.. ఆ పార్టీ గెలుపు గుర్రం కోసం ఫ్లాష్ సర్వేలు చేస్తోంది. ఇక బీజేపీ, బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ పై జెండా ఎగురవేయాలనే ఉత్సాహంతో పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో జరిగిన తప్పు మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతోంది. ఈ క్రమంలోనే అందరికీ సుపరిచితుడు అరూరి రమేశ్ కు టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. దీనికి తోడు ఆయన సైతం టికెట్ కోసం బీజేపీ వైపు చూస్తున్నారనే వార్తలు రావడంతో.. కేటీఆర్ ఆయనతో మాట్లాడి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈనేపథ్యంలో అరూరి సైతం తాను పార్టీ మారడం లేదని వెల్లడిస్తూ వస్తున్నారు.
బీజేపీ టికెట్..
కేంద్రంలో మూడోసారి సైతం బీజేపీ జెండా ఎగురవేయాలని, మళ్లీ మోడీని ప్రధాని చేసేందుకు కాషాయం అడుగులు వేస్తోంది. ఈక్రమంలో వరంగల్ పార్లమెంట్ నియోజవకర్గంలో పట్టుసాధించేందుకు అరూరి రమేశ్ ను పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పార్టీలోకి వస్తే టికెట్ ఇస్తామని చెప్పినట్లు సమాచారం. అయితే ఇటు బీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తుండడం, అటూ బీజేపీ సైతం ఆఫర్ ఇవ్వడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ కు ప్రజల్లో అంతగా ఆదరణ లేకపోవడం, బీజేపీలోకి వెళ్తే గెలుపు సునాయాసం అవుతుందనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలోనూ బీజేపే వచ్చే అవకాశాలు ఉండడంతో భవిష్యత్ బాగుటుందని అటువైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో వరంగల్ బీజేపీ ఎంపీ టికెట్ ఆయనకే వరించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments