రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై నిరసన
సీఎం స్థాయి తగ్గేలా మాట్లాడితే సహించేది లేదు
పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్
స్పాట్ వాయిస్, హన్మకొండ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మూడు రోజుల నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నందుకు నిరసనగా గురువారం పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి హన్మకొండ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేటీఆర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. రూ. 2500కోట్ల కాంట్రాక్టర్ దగ్గర, బిల్డర్స్ దగ్గర వసూలు చేసి ఢిల్లీకి పంపించాడని లేనిపోని అబద్దాలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా మాట్లాడుతూ.. ఆయన పరువు, బాధ్యతలకు భంగం కలిగిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల తర్వాతా భారతీయ జనతీయ పార్టీలోకి వెళ్తాడని ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించే విధంగా వ్యాఖ్యలు చేసి తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని మండిపడ్డారు. సీఎంపై నిరాధారమైన మాటలు మాట్లాడి వ్యక్తిగత పరువు ప్రతిష్టకు భంగం కలిగించినందున కల్వకుంట్ల తారక రామారావుపై కేసు నమోదు చేసి అతనిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఇలాగే కొనసాగితే వారి పార్టీ గుర్తింపు రద్దుకు ఎలక్షన్ కమిషన్ ను కలిసి కోరుతామని ఆయన పేర్కొన్నారు.
కేటీఆర్ పై హన్మకొండ పీఎస్ లో ఫిర్యాదు
RELATED ARTICLES
Recent Comments